Site icon TeluguMirchi.com

విశాఖపట్నం, నెల్లూర్ లలో పురాణపండ శ్రీనివాస్ మహా గ్రంధాలకు భారీ స్పందన

సాధకులు ఎంతో ఇష్టపడే , భక్త జనులు ఎంతెంతో ఇష్టపడే , రసజ్ఞులు ఇంకా ఎంతో ఇష్టపడే బుక్స్ అద్భుతంగా రచించి … అపూర్వంగా సంకలనీకరించి … అపురూపంగా ప్రచురించి … అందించడంలో తెలుగురాష్ట్రాలలో అందెవేసిన చెయ్యి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అని ప్రత్యేకంగా చెప్పఖర్లేదు. శ్రీనివాస్ బహుముఖీన కృషికి , విలక్షణమైన పరమోత్తమ శైలికి వేలల్లో అభిమానులున్నారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ దైవీయ స్పృహల సాఫల్య గ్రంధాలకు భారీ స్పందనతో పాటు పండిత పామరుల అభినందన పొంగులెత్తుతోందనేది సత్యం. ఆధ్యాత్మిక వాతావరణంలో పురాణపండ శ్రీనివాస్ కలం నుండి రూపుదిద్దుకునే గ్రంధాలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. సుమారు వంద గ్రంధాలకు మించి అపురూప గ్రంధాలను వెలువరించిన పురాణపండ శ్రీనివాస్ కొన్ని గ్రంధాలు ఎన్నో పునర్ముద్రణలకు నోచుకుంటున్నాయి.

అందులో ప్రముఖంగా భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించిన భారీ ఆంజనేయ స్వామివార్ల ఉపాస్య మహాగ్రంధం ‘ నన్నేలు నాస్వామి ‘ , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె. వి. రమణాచారి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా అందించిన అఖండ గ్రంధం ‘ శ్రీపూర్ణిమ ‘ ( ఈ దివ్య గ్రంధాన్ని మహోపన్యాసకులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అసాధారణ కృషిని, అపూర్వ శైలీ సొగసులను ప్రశంసించారు ) . ఈ మంగళ త్రోవలో పురాణపండ శ్రీనివాస్ మేలిమి విలువలతో ఋషుల కటాక్షంగా అందించిన మరొక అపూర్వమే ‘ శ్రీమాలిక ” దివ్య గ్రంధం. ఈ మూడింటికి తెలుగు రాష్ట్రాలలో లభించిన , లభిస్తున్న స్పందనకు కొలతలు లేదని చెప్పాలి.

ఈ శ్రావణ మాసపు చివరి శుక్రవారంనాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన అద్భుత కార్యక్రమంలో వందల రసజ్ఞుల సమక్షంలో ‘ శ్రీపూర్ణిమ’ అఖండ గ్రంధం ఇరవై ఆరవ పునర్ముద్రణను సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి కె.వి.రమణాచారి ఆవిష్కరించి అతిధులకు మంత్రమయ జ్ఞాపికలుగా అందజేశారు.

ఇదే సమయంలో మరొక విలక్షణ విశిష్ట మహోత్తమ గ్రంధాన్ని ‘ శ్రీమాలిక ‘ గా సమర్పించిన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ ఆధికారిక స్పోక్స్ పర్సన్ డాక్టర్ సుహాసిని ఆనంద్ తన స్వహస్తాలతో వందలమని భారతీయ జనతాపార్టీ సభ్యులకు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖులకు ఈ ‘ శ్రీమాలిక’ ను ఎంతో సద్భక్తితో సమర్పించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. స్థానికంగా ఈ పవిత్ర కార్యం సంచలనం సృష్టించి ఎంతోమందిని ఆకట్టుకుని సుహాసిని ఆనందపై ప్రశంసల జల్లు కురిపించింది. పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు వున్నా ఆదరణ ఊహాతీతమనే చెప్పాలి.
హైందవ ధర్మానికి సుహాసిని ఆనంద్ చేస్తున్న ఇలాంటి శ్రీకార్యాలు భారతీయ జనతాపార్టీ పురోగతికి మేలుబాటలు పరచడమేనని విశ్వహిందూ పరిషత్ నేతలు సైతం అభినందనలు తెలిపారు.

ఇక పోతే … మరొక ఆకర్షణీయ అంశమేమెంటే నగరి ఎమ్మెల్యే రోజా సైతం తన మంగళ గౌరీ వ్రతానికి విచ్ఛేసిన వందలముత్తయిదువలకు పురాణపండ శ్రీనివాస్ ‘ శ్రీలహరి ‘ మంగళగ్రంధాన్ని పసుపు కుంకుమలతో కలిపి ప్రత్యేకంగా బహుకరించడం వైఎస్సార్సిపి
మహిళా విభాగాన్ని , నగరి మహిళలను విశేషంగా ఆకర్షించింది. ఇటీవల నగరిలో జరిగే ప్రతీ మంగళ కార్యంలో రోజా తనకు ఆప్తులైన పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలను తన ప్రతినిధుల చేత పంపిణీ చేయించడం మరొక ఆసక్తిదాయకంగా అంశం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి , నెల్లూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజక వర్గంలో కొన్ని ఆలయాల పారాయణలకు గాను సుమారు ఐదువేల ప్రత్యేక ‘ శ్రీ సౌరభం ‘ పురాణపండ శ్రీనివాస్ మంగళ గ్రంధాలను భక్తజనులకు అందించడం పట్ల పండిత పామరులు శభాష్ అనడం పురాణపండ అనిర్వచనీయ గ్రంథ వైభవ కృషికి అద్భుత నిదర్శనం.

మార్కెట్ లో గ్రంధాలకు ఆదరణ తగ్గిన ఈరోజుల్లో సైతం పురాణపండ శ్రీనివాస్ రచనా వైభవ గ్రంధాలకు ఎనలేని ఆదరణ, అభిమానులు ఉండటం మామూలు విషయం కాదనే చెప్పాలి. శ్రీనివాస్ నిస్వార్ధ సేవను చూసి కొన్ని పీఠాల, ఆలయాల ప్రతినిధులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారని …ఇది నిజమని … శ్రీనివాస్ సహృదయానికి దైవబలం తోడుగా ఉన్నట్లు మనకు కన్నులముందే కనిపిస్తోందని భారతీయ జనతాపార్టీ ఆంద్ర ప్రదేశ్ అధ్యక్షలు సోము వీర్రాజు ప్రముఖంగా పేర్కొనడం గమనార్హం.

Exit mobile version