రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పుణే సిటీతోపాటు పింప్రి–చించ్‌వడ్ జిల్లాలో శనివారం నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. ఈ సందర్భంగా హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు, పుణే సిటీ బస్సులు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, వారాంతపు సంతలు, మార్కెట్లు వారం రోజులపాటు మూసి ఉంటాయి. పగలు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీంతో పుణేకర్లు సాయంత్రం ఆరు లోపే ఇళ్లకు చేరుకోవల్సి ఉంటుంది. అయితే పెళ్లిలు, అంత్యక్రియలు మినహా ఇతర ఎలాంటి శుభకార్యాలు, సామాజికి సేవా, సంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సభులు, ఇతర కార్యక్రమాలపై నిషేధం విధించారు.