Site icon TeluguMirchi.com

రాకుమారుడి రాకతోనే కోటీశ్వరులయ్యారు!

Kate-Middletoబ్రిటన్ సింహాసనానికి మూడోతరం వారసుడొచ్చాడు. ప్రిన్స్ విలియం దంపతులకు మగబిడ్డ జన్మించాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.24గంటలకు విలియం భార్య కేట్ మిడిల్ టన్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రిన్స్ విలియం జన్మించిన లండన్ లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలోనే బ్రిటన్ సింహాసనానికి మూడోతరం వారసుడు జన్మించాడు.

ఈ శిశువు పుట్టుకతోనే బ్రిటన్ లో కొంత మంది కోటీశ్వరులయ్యారు. ఎలాఅంటారా.. బ్రిటన్ యువరాజ్ విలియమ్స్, కేట్ కు పుట్టబోయే బిడ్డ ఆడా, మగా? దీనిపై బ్రిటన్ వ్యాప్తంగా వేలాది మంది బెట్టింగ్ లు వేశారు. మగ శిశువు పై బెట్టింగు కాసిన వారి పంట పండింది. ‘విలియం దంపతులకు మగబిడ్డ జన్మించాడు’ అని తెలియగానే వీరు కోటీశ్వరులయ్యారు. బ్రిటన్లో ఎప్పటివరకు జరిగిన బెట్టింగ్ లో ఇదే అతిపెద్ద బెట్టింగ్ అని బెట్టింగ్ ఏజెన్సీ కోరల్ అభివర్ణించింది.

Exit mobile version