గర్భిణులు కోవిడ్ గురించి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో ఉండాలని ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న హైదరాబాద్ సూరారంకు చెందిన డి.సింధూజ సూచించారు. ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా కంగారుపడకుండా, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను, శరీర ఉష్ణోగ్రతను గమనించుకుంటుండాలన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు.