అలర్టయిన పోలీసులు – పలుచోట్ల తనిఖీలు

alertపాట్నా బాంబు పేలుళ్ల నేపథ్యంలో.. హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌, నగరంలోని బస్సు స్టాప్‌లు, పలు షాపింగ్ మాల్‌ లతో పాటుగా, హోటళ్లు, లాడ్జీలలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. పాట్నా సంఘటన అనంతరం కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని సూచించిన నేపథ్యంలో… పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణీకుల్ని క్షుణంగా తనిఖీలు చేస్తూనే.. మరోవైపు రద్దీగా ఉన్న హోటళ్ల పై నిఘా వేస్తున్నారు. అదే విధంగా రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న చెత్తకుండీలను సైతం బాంబు డిస్పోజబుల్‌ యంత్రాలతో తనిఖీలు చేశారు. ఏ విధంగానైనా.. ఉగ్రవాదులకు అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో పోలీసులు వున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల మోడీ హుంకార్ ర్యాలీ సందర్భంగా.. పాట్నాలో ఉగ్రవాదులు వరుస బాంబుపేలుళ్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.