మోడీ సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా?

కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వంను ఏర్పర్చిన మోడీ ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి అన్నా కూడా ఏమాత్రం ఆందోళన లేకుండా తీసేసుకుంటున్నాడు. దేశంలో అనూహ్య మార్పులకు నాంది పలుకుతున్నాడు. దేశంలో పలు కొత్త విధానాలను అమలు చేయాలని మోడీ కలలు కంటున్నాడు. ఇటీవలే బ్లాక్‌ మనీ తొలగిపోవాలనే ఉద్దేశ్యంతో 500 మరియు వెయ్యి నోట్లను రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్త 500 మరియు 2000 నోట్లను విడుదల చేయడం జరుగుతుంది. ఇక తాజాగా మోడీ మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకునేందుకు సిద్దం అవుతున్నాడు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ విషయమై దేబ్రాయ్‌ కమిటీని మోడీ ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు అందరికి అన్ని సమయాల్లో సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ సబ్సిడీ కాస్త వృదా అవుతుందని, అలా కాకుండా సొంత ఇల్లు ఉన్న వారికి, కారు మరియు ఏసీలు ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కట్‌ చేయాలని ప్రభుత్వంకు కమిటీ నివేదించడం జరిగింది. కమిటీ ఏదైతే సిఫార్సు చేస్తారో అదే కనుక మోడీ అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో స్వయంగా బీజేపీ కార్యకర్తలు కూడా మోడీకి ఓటు వేసేందుకు ఇష్టపడరు. కాని మోడీ మాత్రం మొండి పట్టుదలతో ఆ పనే మళ్లీ చేయాలనుకునే రకం. ముందుగా గ్యాస్‌ సబ్సిడీని తొలగించడంతో పాటు, దాదాపు 50 రకాల సంక్షేమ పథకాల ఏసీలు, కారులు, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఉన్నా కూడా ఇకపై వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు చాన్స్‌ లేదు.