Site icon TeluguMirchi.com

గాంధీ జయంతి రోజు నుండి రైళ్లలో అవి బ్యాన్‌

భారతదేశంను స్వచ్చ భారత్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా చేసినా కూడా పూర్తి ఫలాలు మాత్రం అదడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉంది. వర్తకులను ఎంతగా హెచ్చరించినా కూడా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంను మాత్రం మానడం లేదు. కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని, దేశం నుండి ప్లాస్టిక్‌ను తమిరికొట్టే సమయం వచ్చిందని మోడీ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

మోడీ పిలుపు నేపథ్యంలో ఇండియన్‌ రైల్వేస్‌ గాంధీ జయంతి రోజు నుండి రైల్లలో 50 మైక్రాన్స్‌ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌లను బ్యాన్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రైలులో అక్టోబర్‌ 2 నుండి అలాంటి ప్లాస్టిక్‌ కవర్‌లు కనిపిస్తే చర్యలు తీసుకోనున్నారు. రైల్వే సిబ్బంది కూడా 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్‌లను వాడకూడదని రైల్వే శాఖ నుండి ఆదేశాలు అందుకున్నారు. రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. మరి ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version