అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పలికే రేటును బట్టి డిజిల్ మరియు పెట్రోల్‌ల రేట్లు ఉంటాయి అనే విషయం తెల్సిందే. అక్కడ క్రూడాయిల్ ధరలు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. దాంతో రేటు పెరిగినప్పుడు కంపెనీలు నష్టాలు భరించాల్సి వచ్చింది, కొన్ని సార్లు వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఆ కారణంగానే ప్రతిరోజు రేట్లను సమీక్షించే విధానం తీసుకు రావాలని నిర్ణయించారు. అయితే రేట్లు అనేది రోజులో ఒక్కసారి మాత్రమే మారాలా లేక గంట గంటకు కూడా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.