ఇప్పుడున్న పెట్రోల్ రేటును కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. ఈ రోజు పెట్రల్ ధరలకు నిరసనగా ఒక పక్క ప్రతిపక్షాలు బంద్ చేస్తున్నాయి. అయితే పెట్రోల్ ధరలపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రమ్య తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు.
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి టెస్టులో సాధించిన అత్యధిక స్కోరు కంటే పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. భారత్ బంద్ చేపట్టిన నేపథ్యంలో ఆమె ట్విటర్లో స్పందిస్తూ… ‘‘86 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అత్యధిక స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే రూ.87కు దూసుకెళ్లిన పెట్రోల్ అంతకంటే టాప్‌లో కొనసాగుతోంది…’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Ravindra Jadeja at 86 was India's second highest scorer. The highest remains petrol at 87. #EngvInd #MehangiPadiModiSarkar
— Divya Spandana/Ramya (@divyaspandana) September 10, 2018
అయితే ఇప్పుడు దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ మాదిరిగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయంటూ ఆమె పోస్టు చేసిన మరో ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. యూపీఏ హయాంలో అమిర్‌ఖాన్ సిక్స్ ప్యాక్‌లో కనిపించినట్టు పెట్రోల్ ధరలు ఉన్నాయనీ, ఎన్డీయే హయాంలో దంగల్ సినిమాలో అమీర్‌ఖాన్‌లా ధరలు పెరిగాయని ఆమె పోల్చి చెప్పడంతో నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
#MehangiPadiModiSarkar #BharatBandh pic.twitter.com/pRsiMyH4Nf
— Divya Spandana/Ramya (@divyaspandana) September 10, 2018