అతి త్వరలో వాహనదారులు శుభవార్త వినబోతున్నారా..అంటే అవుననే అంటున్నాయి నిపుణులు. గత కొద్దీ రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశానికి తాకుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధర ఎన్నడూ లేని విధంగా వందకు పైకి చేరడం తో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో నిపుణులు ఓ తీపి కబురు తెలిపారు. ఒపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం తో అతి త్వరలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని..దాదాపు రూ.5 ల వరకు తగ్గొచ్చని అంటున్నారు.