అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధర తగ్గడంతో వరుసగా ఎనిమిదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే ఈ తగ్గింపుతో సామాన్యుడికి స్పల్ప ఊరట లభించింది. తగ్గినా రేట్లు ఈ రోజు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 5 పైసలుగా ఉన్నాయి. అయితే ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ప్రకటన విడుదల చేసింది.
తాజా ప్రకటనతో హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.98, డీజిల్ రూ. 81.36కి తగ్గింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ 84.28 డీజిల్ రూ 79.09కి తగ్గింది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 81.10కి, డీజిల్ రూ.74.80కి తగ్గింది. కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 82.92 డీజిల్ ధర రూ. 76.65కి తగ్గింది. ఇక ముంబై లో పెట్రోలు ధర రూ. 86.58కి, డీజిల్ రూ. 78.41కి తగ్గింది.
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచితే రూపాయిలలోను , తగ్గిస్తాం మాత్రం పైసాలోను చేస్తుంది. మరీ ఎప్పటికి తీరతాయో సామాన్యుడి కష్టాలు?