పెట్రోల్, డీజిల్ పై 2 లక్షల 94 వేల కోట్ల ఆదాయం, భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి 2 లక్షల 94 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. గత 6 సంవత్సరాల్లో చమురుపై పన్నుల రూపేణా కేంద్రానికి లభించే ఆదాయంలో 300 శాతం వృద్ధి నమోదైందని పార్లమెంటులో వివరించారు.

2014లో ఒక లీటరు పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం 9 రూపాయల 48 పైసలుండగా, ఇప్పుడది 32 రూపాయల 90 పైసలుకు చేరిందని అనురాగ్ ఠాకూర్ వివరించారు. అదే సమయంలో డీజిల్ ఒక లీటరుపై 3 రూపాయల 56 పైసలుగా ఉన్న సుంకం నేడు 31 రూపాయల 80 పైసలుకు పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లభించే మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ పై లభించే ఆదాయం 2014-15లొ 5.4 శాతం ఉంటే 2020-21 నాటికి 12.2 శాతానికి చేరిందని ఆయన స్పష్టం చేశారు.