రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూసి వాహనదారులకు చెమటలు పడుతున్నాయి. ఈరోజు పెరిగిన ధర చూసి వామ్మో అనుకునేలోపే..మరోసటిరోజు మరింత పెరిగి షాక్ కు గురి చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రోల్ ధరలు పెరిగాయి.
తాజాగా పెరిగిన పెట్రోల్ , డీజల్ ధరలు చూస్తే..
*ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.88.44, డీజిల్ రూ.78.74కు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్‌కు రూ.94.93, కోల్‌కతాలో రూ.89.73, చెన్నైలో రూ.90.70, బెంగళూరులో రూ.91.40, హైదరాబాద్‌లో రూ.91.96, జైపూర్‌లో రూ.95.35, పాట్నాలో రూ.91.15, త్రివేండ్రం రూ.90.32కు పెరిగింది.
- డీజిల్ ముంబైలో లీటర్‌కు రూ.85.70, కోల్‌కతాలో రూ.82.33, చెన్నైలో రూ.83.86, బెంగళూరులో రూ.83.47, హైదరాబాద్‌లో రూ.85.89, జైపూర్‌లో రూ.87.48, పాట్నాలో రూ.84.24కు చేరింది.