Site icon TeluguMirchi.com

వీడు పాస్టర్ కాదు కామపిశాచి

బయటకు పాస్టర్ ..చేసే పని మాత్రం కామక్రీడలు. చర్చి కి వచ్చే ఆడవారిపై కన్నేసి..వారిపై జీవితాలతో ఆదుకోవడం ఈ పాస్టర్ కు అలవాటు. ఇంతకీ ఈ పాస్టర్ మేటర్ ఏంటి అంటే.. బోడుప్పల్‌లోని లక్ష్మీ నగర్‌లో నివాసముండే చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ జోసెఫ్ క్రైస్తవ మత ప్రబోధకుడిగా కొనసాగుతున్నాడు. ఉప్పల్‌‌లోని గోస్పల్ చర్చిలో పాస్టర్ గా పనిచేస్తూ సొంతంగానూ చర్చిని నిర్వహిస్తున్నాడు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న యువతి తరచు గోస్పల్ చర్చికి వెళ్ళేది. ఆమెపై కన్నేసిన జోసెఫ్ పరిచయం పెంచుకున్నాడు.

జనవరి నెలలో శంషాబాద్‌లోని చర్చికి వెళ్తున్నానని యువతికి చెప్పిన జోసెఫ్ ఆమెను కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి యువతిని బెదిరింపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్టర్‌ని నిలదీసి పోలీస్‌ కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని జోసెఫ్ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేసాడు. దీంతో మరోసారి సదరు యువతీ పాస్టర్ ను నిలదీసింది. దీంతో పాస్టర్ కుటుంబసభ్యులకు, యువతికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో విషయం బయట పెడితే చంపేస్తామంటూ జోసఫ్ తండ్రి, సోదరుడు బాధితురాలిని బెదిరించారు. దీంతో ఆమె నేరుగా మేడిపల్లి పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిర్యాదు స్వీకరించిన పోలీసులు పాస్టర్ తో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేసారు. పాస్టర్ జోసెఫ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఫాస్టర్ ముసుగులో అనేక మంది యువతులపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

Exit mobile version