Site icon TeluguMirchi.com

ప్రయాణికులపై రైల్వే బాదుడు..భారీగా పెరిగిన రైల్వే చార్జీలు

హమ్మయ్య..మళ్లీ రైళ్ల రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇబ్బంది లేదని రైల్వే ప్రయాణికులంతా అనుకుంటున్నారు కానీ..ఇప్పుడు వారికీ ఓ షాకింగ్ న్యూస్. రైళ్లను నడపడం స్టార్ట్ చేసిన రైల్వే అధికారులు..చార్జీలు కూడా భారీగా పెంచి ప్రయాణికులపై మరింత భారం మోపారు. ప్యాసింజర్‌ (ఆర్డినరీ) రైళ్లలో 30 నుంచి 200 శాతం వరకు అదనంగా చార్జీలను వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

లాక్‌డౌన్‌ సమయంలో రైల్వే ట్రాక్‌లను బలోపేతం చేసి గంటకు 130 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో ప్రయాణించేలా చర్యలు తీసుకున్నామని, ఇకపై ప్యాసింజర్ రైళ్లు కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తున్నందునే అధిక చార్జీలను వసూలు చేస్తున్నామంటూ రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్ల మధ్య సౌకర్యాల పరంగా ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. అందువల్ల ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నపుడు ఇక ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణించడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version