Site icon TeluguMirchi.com

పాక్‌కు ఎందుకు ఇంత బలుపు, స్వీట్లు కూడా వద్దన్నారు

ఇండియాకు పూర్తి అంతర్గత విషయం అయిన ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్థాన్‌ ఎందుకు ఇంతగా ఇది అవుతుందో అర్థం కాక ప్రపంచ దేశాలు నోరు వెళ్లబెడుతున్నాయి. అమెరికా మరియు చైనా వంటి దేశాలు సైతం అది ఇండియా అంతర్ఘత విషయం అంటూ వదిలేస్తే పాకిస్తాన్‌ మాత్రం ఆ విషయమై చాలా సీరియస్‌గా ఉంది. ఆర్టికల్‌ 370 రద్దు అనేది కశ్మీరిల హక్కులను కాలరాయడమే అంటూ కూతలు కూస్తోంది. ఇప్పటికే రద్దుకు నిరసనగా ఇండియాతో వ్యాపార సంబంధాలు తెంచుకుంది. ఆ కారణంగా అక్కడ పలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకేలా పెరిగి పోయాయి.

ఇక నేడు బక్రీద్‌ సందర్బంగా రెండు దేశాలకు చెందిన ఆర్మీ జవాన్‌లు వాఘా అటారీ సరిహద్దు వద్ద సీట్లు పంచుకోవాల్సి ఉంది. కాని ఆ కార్యక్రమంను పాకిస్థాన్‌ తిరష్కరించింది. ఎప్పటి మాదిరిగానే ఇండియన్‌ ఆర్మీ సీట్లు పంచేందుకు సిద్దం అయ్యి పాకిస్థాన్‌ వారికి సమాచారం ఇవ్వగా అందుకు పాకిస్థాన్‌ జవాన్‌లు ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి ఇండియన్స్‌తో ఎలాంటి సంబంధాలు వద్దనుకుంటున్నప్పుడు వారు ఇచ్చే స్వీట్స్‌ ఎందుకు అంటూ తిరష్కరించారట. వారి కోపం, వారి బలుపు వారికే మోసం అని పాకిస్థాన్‌ ఇంకా ఎంత కాలంకు తెలుసుకుంటుందో..!

Exit mobile version