పాక్‌ చేతిలో తొలిదెబ్బ తిన్న భారత్‌

Pakistan defeat India by 5 wicketsమంగళవారం చిన్నస్వామి స్టేడియంలో భారత్‌, పాకిస్థాన్‌ లమధ్య జరిగిన తొలి డే అండ్ నైట్ ట్వంటీ-20లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ నెగ్గిన పాక్‌ బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్‌ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి చేసిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆదిలో తడబడినా చివరకు గట్టెక్కింది. షోయబ్ మాలిక్ (57), హఫీజ్ (61)లు నాలుగు ఓవర్లకే 17 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. భారత్‌పై పాకిస్థాన్ తొలి ట్వంటీ విజయాన్ని వీరివురూ రాణించడంతో చేజిక్కించుకుంది. చివరి ఓవర్‌కు 10 పరుగులు చేయాల్సిన పాక్ ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా, దిండా, ఇషాంత్‌లకు తలో వికెట్టు దక్కింది.