Site icon TeluguMirchi.com

దర్శకుడి కుమారుడికి కరోనా తగ్గింది

మలయాళం దర్శకుడు పద్మకుమార్ తనయుడు ఆకాశ్‌ కరోనా వైరస్ భారి బారిన పడిన సంగతి తెలిసిందే. పద్మకుమార్‌ తనయుడు ఆకాశ్‌ పారిస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ స్నేహితుడు ఎల్దో మాథ్యూతో కలిసి మార్చి 15న కేరళకు తిరిగి వచ్చాడు విదేశాల నుంచి వచ్చినవారందరినీ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే కరోనా లక్షణాలు బయటపడటంతో కలామాసెరీ మెడికల్‌ కాలేజీలో ఆకాశ్‌, మాథ్యూకు చికిత్స అందించారు.

కాగా తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. దీంతో వారిని శ్చార్జి చేశారు. ఈ విషయాన్ని పద్మకుమార్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ‘‘కరోనా బారిన నా కుమారుడు ఆకాశ్‌, తన స్నేహితుడు ఎల్దో మాథ్యూ కోలుకున్నారు. కరోనాపై పోరులో అంకితభావం ప్రదర్శిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు ’’అని రాసుకొచ్చారు.

Exit mobile version