ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌ అవడంతో 22 మంది మృతి, ప్రధాని ఏమన్నారంటే ?

మహారాష్ట్ర నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రి వద్ద ఆక్సిజన్‌ నింపుతుండగా.. ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్‌ కావడంతో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది.

ఈ ఘటన పై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని ప్రధాని అన్నారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.