Site icon TeluguMirchi.com

ఒమిక్రాన్‌పై డబ్ల్యుహెచ్ఓ తాజా హెచ్చరిక

ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో స‌గం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డ‌బ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు డాక్టర్ హ‌న్స్ క్లూజీ చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు దిశ‌గా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్‌లో 70 ల‌క్షల కొత్త కేసులు న‌మోదయ్యాయని, దీని ఆధారంగా డ‌బ్ల్యూహెచ్‌వో ఈ అంచ‌నా వేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కేవ‌లం రెండు వారాల వ్యవ‌ధిలోనే ఇన్‌ఫెక్షన్లు రెండింత‌లు అయిన‌ట్లు తెలుస్తోంది. యూరోప్‌లో 8 వారాల్లోగా స‌గం మందికి ఒమిక్రాన్ సోకుతుంద‌ని సియాటిల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫ‌ర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేష‌న్ సంస్థ వెల్లడించిన‌ట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు.

Exit mobile version