టోక్యో ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి దేశానికి అద్భుత విజయాన్నిఅందించారు. ఒలింపిక్ అథ్లెటిక్స్ లో 100 సంవత్సరాల తర్వాత మన దేశానికి మొదటిసారిగా స్వర్ణ పతకం లభించింది. ఇప్పటివరకు మొత్తం 1 స్వర్ణ పథకం, 2 రజత పథకాలు, 4 కాంస్య పథకాలు సాధించిన ఇండియా ప్రస్తుతం రాంక్ టేబుల్ లో 47 వ స్థానంలో నిలిచింది.