Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ తర్వాత ఎలా ?


కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాదారు. లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రధానమంత్రి అన్నారు.

దీన్ని అదిగమించేందుకు రాష్ర్టాలు, కేంద్రం సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు. దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ భేటీలో పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా రాష్ర్టాల సీఎంలు స్పందిస్తూ… క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారన్నారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు ప్రధానికి తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా తీసుకున్న చర్యలను పీఎంకు వివరించారు.

Exit mobile version