మరిన్ని భాషల్లో ఎన్టీవీ అనుబంధ భక్తి ఛానల్

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమౌతోన్న ప్రముఖమైన ఎన్టీవీ ఛానల్ పై అమ్మకాలు జరుగుతున్నాయంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇదే విషయంపై యాజమాన్యంతో సంప్రదించగా.. అలాంటిదేం లేదని.. ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో కూడా తెలియకుండా ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్టీవీ సంస్ధకు అనుబంధంగా నడుస్తోన్న వనిత.. భక్తి ఛానళ్లు మరిన్ని భాషల్లో విస్తరించనున్నట్లు కూడా యాజమాన్యం ఈ సందర్భంగా వెల్లడించింది.

అదేమంటే.. ఈ యేడాది చివరికి భక్తి ఛానల్ ను కన్నడ, తమిళంలో కూడా ప్రసారాలను విస్తరించి ఆ విధంగా సంస్థను మరింత ద్విగుణీకృతం చేసేందుకు పాటుపడుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఎన్టీవీని అమ్ముతున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు కొట్టిపారేశారు.