ఏమి లేని వాడు ఎగిరెగిరి పడుతుంటే అన్ని ఉన్న వాడు అణుకువగా ఉన్నట్టు ఉంది ప్రస్తుతం రెండు ఛానల్ ల మధ్య గొడవ చూస్తుంటే.. అందులో ఒకాయన ఎన్టీవీ చౌదరి… ఈ మధ్యకాలం లో చౌదరి మీద సోషల్ మీడియా లో చాలా వార్తలు సర్క్యూలేట్ చేసారు .. వాటిని చూసినవారెవరికైనా తెలుస్తుంది ఎవరో వాటిని తయారుచేసారో.. చౌదరి మీద కేసంటూ తమకు తెలిసిన కొందరితో సోషల్ మీడియా లో ప్రచారం చేయించడం చూసాం కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ పడింది…ఇప్పడు అసలు ఆ కేస్ ను పోలీసులు ఉపసంహరించుకున్నట్టు గా తెలుస్తుంది .. దీనికి సంబంధించి కోర్ట్ లో అఫిడవిట్ ను పోలీస్ లు కోర్ట్ లో సమర్పించారని సమాచారం..దీంతో సదరు ప్రత్యర్థి ఛానల్ కు దిమ్మతిరిగినంతపనైందoటున్నారు మీడియా జనాలు..
ముందునుంచి ఎదో ఒక ఫేక్ ప్రచారం చెయ్యడం చావుదెబ్బ తినడం సదరు ఛానల్ కు అలవాటేనంటున్నారు..మరి ఇంత ప్రచారం జరుగుతుంటే చౌదరి ఏమంటున్నారు .. కొందరు ఉద్యోగులు వెళ్ళి జరుగుతున్న ప్రచారం గురించి చెబితే ఆయన నవ్వారట.. వెళ్ళి పనిచేసుకోండి వీటిని పెద్దగా పట్టించుకోకండి అని చెప్పారట .. అసలు రెండు రాష్ట్రాల పెద్దలతో మంచి సంబంధాలున్న చౌదరి తో పెట్టుకోవడం ఎలావుంటుందో అయన ప్రత్యర్థులకు ఇప్పుడు బాగా తెలిసిందంటున్నారు .. ఆయన సరదాగా తీసుకుంటేనే ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఆయన సీరియస్ గా తీసుకుంటే ఎలావుంటుందో అని అనుకుంటున్నారు కొందరు మీడియా మిత్రులు..