ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కుదిపేస్తోంది. భారత్‌లోను తన ప్రతాపాన్ని చూపిస్తుంది.. రోజు రోజుకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కాగా కరోనావైరస్ నివారణ చర్యల్లో అమెరికా విఫలం అయ్యిందంటూ… ఎన్ఆర్ఐ యాంకర్ స్వాతి ఓ వీడియోను సోషల్ మీడియాలో వదలడం.. అది కాస్తా వైరల్‌గా మారిపోవడం.. వివాదంగా మారింది. మెరికా కరోనా కట్టడిలో పూర్తి విఫలం అయ్యిందని.. భారత్ మాత్రం నివారణ చర్యల్లో మంచి ఫలితాలు సాధించిందని ఆమె చెప్పుకొచ్చారు.
కరోనా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలపై అమెరికాలో ఎన్ఆర్ఐ యాంకర్ స్వాతి దేవినేనిపై కేసు పెట్టారు. న్యూయార్క్‌లో ఎన్నారై తెలుగు యాంకర్ స్వాతిపై కేసు నమోదైంది. శ్రవణ్ అనే తెలుగు ఎన్ఆర్ఐ.. న్యూయార్క్‌లోని ఒక పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు.