Site icon TeluguMirchi.com

సుబ్రతారాయ్ సుప్రీం వార్నింగ్


సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15వ తేదీ నాటికి షూరిటీ కింద రూ. 2,500 కోట్లు చెల్లించాలని… లేకపోతే, మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. గడువులోగా చెల్లింపులు జరగాలని.. చెక్ బౌన్స్ అయితే కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది.

సహారా గ్రూప్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా 24 వేల కోట్ల రూపాయలను వసూలు చేసిన ఆరోపణలతో కోర్టు కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2014లో అరెస్టైన సుబ్రతా రాయ్ గత ఏడాది బెయిల్ పై బయటికివచ్చారు . అయితే పలుమార్లు ఆయనకు షూరిటీ కింద డబ్బులు చెల్లించాలి ఆదేశించింది కోర్టు. అయితే ఆయన డబ్బులు చెల్లించే దిశాగా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన పెరోల్‌ గడువు ముగియడంతో సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది కోర్టు.

Exit mobile version