Site icon TeluguMirchi.com

గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా..అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు గ్యాస్ సబ్సిడీ ని వినియోగదారుల ఖాతాలో వేసేవారు. కానీ గత మే నెల నుండి భారీగా తగ్గించారు. కేవలం రూ. 40 మాత్రమే వేస్తున్నారు. ఇక ఇప్పుడు అవి కూడా వేసే పరిస్థితి లేకుండా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

2021-22 బడ్జెట్‌లో పెట్రోలియం సబ్సిడీ కోసం కేంద్ర రూ. 12,995 కోట్లు కేటాయించింది. 2019-20 సంవత్సరంలో కేటాయించిన నిధుల(రూ. 40 వేల కోట్లు) కంటే చాలా తక్కువ. ఈ చర్య వల్ల కిరోసిన్, గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించడం లేదా మొత్తం సబ్సిడీని ఎత్తేయడం జరుగుతుందని అధికారిక వర్గాల నుంచి సమాచారం. మరోపక్క గ్యాస్ ధరకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే 7 వందలకు ఫైగా ఉన్న ధర నిన్నటి నుండి మరో 25 పెంచారు. దీంతో 770 కి చేరింది.

Exit mobile version