అభిప్రాయాలకు… అరెస్ట్ లు వద్దు : సుప్రీం

jayavindhyala-supreemపౌర హక్కుల నేత జయవింధ్యాల అరెస్ట్ పై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. సోషన్ నెట్ వర్కింగ్ లో వెలుబుచ్చే అభిప్రాయాలకు అరెస్ట్ చేయడం తగదని పేర్కొంది. ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్లలలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిని ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల అనుమతితో మాత్రమే అరెస్ట్ చేయాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

పౌర హక్కుల నేత జయవింధ్యాలపై రాష్ర్ట ప్రభుత్వం ఐటి చట్టంలోని 66 సెక్షన్ ని ప్రయోగించకుండా చూడాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం అభిప్రాయాలపై ముందే అరెస్ట్ లు వద్దని, విచారణ తరువాత మాత్రమే వారిని అరెస్ట్ చేయాలని సూచించింది. అయితే, జయవింధ్యాల తన ఫేస్ బుక్ ద్వారా… చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్, ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ ల పరువుకు భంగం కలిగించేలా కమెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చీరాలపోలీసు జయవింధ్యాలను అరెస్ట్ చేయడం జరిగింది.

అయితే, తాజా సుప్రీం తీర్పుతో.. జంయవింధ్యాలకు ఊరట లభించినట్లయింది. ఒకవేళ అరెస్ట్ చేసినా.. ముందుగా విచారణ జరపాలి కాబట్టి. ఇక నుంచైనా.. ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లలో కామెంట్స్ చేసే ముందు కామన్ సెన్స్ తో .. ఆలోచాలనేది పండితుల మాట!. కానూన్స్ డిమాండ్ చేస్తే అంతే మరీ !