Site icon TeluguMirchi.com

‘ఇంటికి పోదాం లెవయ్యా’.. కలచివేసిన ఓ భార్య రోదన

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం వాసి అశోక్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష కోసం రెంజల్ పీహెచ్‌సీకి వెళ్లాడు. టెస్ట్ చేయించుకుని ఫలితం కోసం వేచియున్న సమయంలోనే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఫలితం కోసం గాబరా పడుతూ చివరికి కరోనా లేదని తేలినా ప్రాణాలు కోల్పోయాడు. తోడుగా వచ్చిన బాధితుడి భార్య పీహెచ్‌సీ ప్రాంగణంలో ‘ఇంటికి పోదాం లేవయ్యా’ అంటూ రోదించిన తీరు పలువురిని కలచివేసింది. రోగం కన్నా భయంతో ప్రాణాలు పోతున్నాయి అనేదానికి ఈ సంఘటన ఉదాహరణ కాబట్టి ఎవరు భయపడకండి.

Exit mobile version