Site icon TeluguMirchi.com

’మిస్ అమెరికా’గా.. తెలుగమ్మాయి.. !

nichadavuluriఅమెరికాలో నివసిస్తున్న తెలుగమ్మాయి నీనా దావులూరి (24) మిస్ అమెరికా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 15 మంది సెమీఫైనలిస్టులను అధిగమించి ఆమె ఈ ఘనతను సాధించారు. కృష్ణా జిల్లా విజయవాడ నీనా స్వస్థలం. ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నచ్చినా, నచ్చకున్నా అలాగే ఉండాలని… కానీ ప్రకృతి పరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందం ఇచ్చే మానసికానందం అన్నింటికన్నా గొప్పదన్న నీనా సమాధానం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. అమెరికా తరపున నీనాకు ఉపకార వేతనాల రూపంలో 50 వేల డాలర్లు అందనున్నాయి. కాగా, ఈ ఏడాది మిస్ న్యూయార్క్ కిరీటాన్ని కూడా నీనా దువులూరి సొంతం చేసుకొంది.

Exit mobile version