లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్., కోవిడ్ -19 చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం “నిక్లోసమైడ్” రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం “నిక్లోసమైడ్” యొక్క సమర్థత, భద్రత మరియు సహనాన్ని అంచనా వేయడానికి, మల్టీ-సెంట్రిక్, ఫేజ్-2, రాండమైజ్డ్, ఓపెన్ లేబుల్ క్లినికల్ అధ్యయనంగా ఈ పరీక్షలు చేపట్టారు. పెద్దవారిలో మరియు పిల్లల్లో టేప్-వార్మ్ సంక్రమణ చికిత్స కోసం నిక్లోసమైడ్ గతంలో విస్తృతంగా ఉపయోగించబడింది. ఈ ఔషధం యొక్క భద్రతా ప్రొఫైల్ కాలక్రమేణా పరీక్షించబడింది. అలాగే, వివిధ మోతాదు స్థాయిలలో మానవ వినియోగానికి సురక్షితంగా కనుగొనబడింది.
“నిక్లోసమైడ్” ఉపయోగించి రెండవ దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఎస్.ఈ.సి. సిఫారసులపై సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే, సంతోషం వ్యక్తం చేశారు. ఇది సాధారణ, సరసమైన ఔషధం మరియు భారతదేశంలో సులభంగా లభిస్తుంది. అందువల్ల మన జనాభాకు అందుబాటు లో ఉంచవచ్చునని, ఆయన తెలియజేశారు.