ప్రసారభారతి అధికారిక యాప్ అయిన ‘న్యూస్‌ఆన్‌ఎయిర్’ ద్వారా, ‘ఆల్ ఇండియా రేడియో’కు చెందిన 240కి పైగా ఆకాశవాణి సేవలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ‘న్యూస్‌ఆన్‌ఎయిర్’ యాప్‌లో వచ్చే ‘ఆల్ ఇండియా రేడియో’ ప్రసారాలకు ఒక్క భారత్‌లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాల్లో, 8000కుపైగా నగరాల్లో అధిక సంఖ్యలో శ్రోతలు ఉన్నారు.
భారత్‌లో కాక, ‘న్యూస్‌ఆన్‌ఎయిర్’ బాగా ప్రాచుర్యంలో ఉన్న విదేశాల సమాచారం ఇక్కడ ఉంది. విదేశాల్లో ఎక్కువమంది వినే కార్యక్రమాల వివరాలు కూడా ఉన్నాయి. నగరాలు, దేశాలవారీగా కూడా సమాచారాన్ని చూడవచ్చు. ఈ నెల 1-15 తేదీల మధ్య పక్షం రోజుల సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. భారతదేశ సమాచారాన్ని ఇందులో చూపలేదు.
ఈ ర్యాంకుల్లో విశేషం ఏమిటంటే, ఇప్పటివరకు తొలిస్థానంలో ఉన్న ఫ్రాన్సును వెనక్కునెట్టి అమెరికా అగ్రపీఠంపైకి చేరింది. ఫ్రాన్స్ రెండో స్థానానికి పరిమితమైంది. తొలి 10 దేశాల జాబితాలోకి జపాన్ మొదటిసారి అడుగుపెట్టింది.
1) VividhBharati National, 2) FM Gold Delhi, 3) FM Rainbow Delhi, 4) AIR Malayalam, 5) AIR Chennai Rainbow, 6) AIR Tamil, 7) News 24×7, 8) AIR Punjabi, 9) AIR Kodaikanal, 10) Asmita Mumbai