Site icon TeluguMirchi.com

పోరాడి ఓడిన భారత్…అభిమానులకి గుండెకోత

వరల్డ్ కప్ లో కప్ తెస్తుందని నమ్మిన ఇండియా ఆశలు అడియాసలు చేసింది. విశ్లేషకుల విశ్లేషణలే నిజమయ్యి పిచ్ కు బలైంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ లో జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ కి వరుణుడి పోటు ఇండియాని ఇంటికి పంపేసింది. ఎంతో కష్టపడి న్యూజిలాండ్ ను 239 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా తాను మాత్రం పిచ్ దెబ్బకు బలయ్యింది.

ఇక కివీస్ బౌలర్లు పిచ్ ను సద్వినియోగం చేసుకుని రెచ్చిపోయిన వేళ 240 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఏడూ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఎంతో సునాయాసంగా ఫైనల్ చేరతారనుకుంటే అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. 18 పరుగుల తేడాతో భారత్ ను ఓడించిన కివీస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది.

రేపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీస్ విజేతతో జూలై 14న జరిగే టైటిల్ పోరులో తలపడనున్నారు. జడేజా, ధోనీ క్రీజులో ఉన్నంతసేపు గెలిచేలా కనిపించినా జడేజా 77 పరుగులు సాధించి అవుటైన తర్వాత, ధోనీ బ్యాట్ ఝుళిపిస్తాడని, జట్టును గెలిపిస్తాడని అందరూ ఆశించారు. అంచనాలకు తగ్గట్టే ఓ భారీ సిక్స్ తో తన ధాటి మొదలుపెట్టిన ధోనీ ఆ తర్వాత దురదృష్టం కొద్దీ రనౌట్ తో వెనుదిరిగాడు. ఇక, చాహల్, బుమ్రా జోడీ చివరి ఓవర్ ను కాచుకోగా, అప్పటికి భారత్ విజయానికి 6 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. కానీ చాహల్ అవుట్ కావడంతో అక్కడితో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది.

Exit mobile version