సకల రోగ నివారిణి నేరేడు

neredpallu
నేరేడు పళ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ముఖ్యంగా నేరేడు పళ్లు మధుమేహ వ్యాధి నివారణకు బాగా ఉపకరిస్తాయి. ఇందులో గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ వ్యాధికి చక్కగా పనిచేస్తాయి. యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్స్ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది. ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే వ్యాధి నిరోధక శక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది. చిన్న పిల్లల్లో కనిపించే ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేరేడు పళ్లు క్యాన్సర్ రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. నేరేడు పళ్లు మాత్రమే కాదు, నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి. నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.