వచ్చే నెలలో భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరిగే టీ౨౦, ఒన్డే సీరీస్ లకు భారత జట్టుకు ఓపెనింగ్ బాట్స్మన్ శిఖర్ ధావన్ నేతృత్వం వహిస్తారు. ఇరవై మంది సభ్యుల జట్టుకు భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా ఉంటారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు తెలిపింది. అయితే ఈ టూర్ కి శిఖర్ ధవన్ తప్ప ఒక్క సీనియర్ ని కూడా సెలెక్ట్ చేయకపోవడం గమనార్హం.
శ్రీలంక తో తలపడే భారత జట్టు : శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా