ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 26 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ నరసరావుపేటపై ఫోకస్ పెట్టారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
నరసరావు పేటలో కరోనా కేసులు సంచరీ క్రాస్ చేసింది. ఇవాళ కూడా 26 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో మొత్తం 104 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరగడంపై నరసరావుపేట ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కరోనా కట్టడికి నరసరావు పేట డివిజన్ మొత్తాన్ని అధికారులు ఇవాళ, రేపు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు.