కరోనా అంటే అందరూ భయపడుతున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కావాలని వైరస్ ఎక్కించుకున్నారు. ఆయన జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫెన్ వాన్ డాస్సెల్. తన పార్ట్ నర్ నుంచి తాను కావాలనే వైరస్ ను ఎక్కించుకున్నానని చెప్పారు.
అయితే తాను ఊహించిన దాని కంటే అనారోగ్యం ఎక్కువ కాలం ఉందని తెలిపారు. వైరస్ ను ఎదుర్కొనే నిరోధక శక్తిని సాధించాలనే ఉద్దేశంతో ఇన్ఫెక్షన్ ను ఎక్కించుకున్నానని చెప్పారు. ఒక మూడు రోజుల పాటు అనారోగ్యంతో ఉంటానని, ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని సాధిస్తానని భావించానని తెలిపారు. అయితే తాను ఊహించిన దానికంటే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.