Site icon TeluguMirchi.com

తాజ్‌ మహల్‌కు ముల్తానీ మట్టీ ప్యాక్‌

ప్రపంచ వింతల్లో ఒక్కటైన తాజ్‌ మహల్‌ రోజు రోజుకు కాలుష్యం భారిన పడి శిధిలావస్తకు చేరుకోబోతుంది. ఇప్పటికే తాజ్‌మహల్‌ కలర్‌ చాలా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఛారిత్రాత్మక కట్టడం అయిన తాజ్‌ మహల్‌ను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసింది. ఎన్నో సంస్థలు మరియు యూనివర్శిటీలు తాజ్‌మహల్‌ను పరిరక్షించేందుకు ఏం చేయాలనే ఖచ్చితమైన విషయాన్ని చెప్పలేక పోతున్నాయి.

తాజ్‌ మహల్‌ను కాలుష్యం నుండి కాపాడేందుకు ముల్తానీ మట్టితో ఫ్యాక్‌ చేయాలని నిర్ణయించారు. అందుకోసం కేంద్ర అనుమతి మరియు పర్యవరణ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంది. దీనిని మడ్‌ తెరపీ అంటారట. ఈ థెరపీ వల్ల తాజ్‌ మహల్‌ కలర్‌ పోకుండా ఉంటుందని, మునుపటి కలర్‌కు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌కు వేసుకునే ముల్తానీ మట్టీ ప్యాక్‌ తాజ్‌ మహల్‌ను ఎంత మేరకు కాపాడుతుంది అనేది చూడాలి.

Exit mobile version