2011 నుండి కూడా సదరు కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోని సీఈఓ కాబోతున్న విషయాన్ని కంపెనీలోని ఉద్యోగస్తులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ధోని ఆఫీస్‌లోకి అడుగు పెట్టిన తర్వాతే అందరికి తెలిసింది. కంపెనీ సీఈఓగా మొదటి రోజు ధోని పలు మీటింగ్స్‌కు హాజరు అయ్యారు, అలాగే కంపెనీ ఉన్నతోద్యోగులతో కూడా సమావేశం అయ్యాడు. ఈ సందర్బంగా కంపెనీ గురించిన కొన్ని కీలక నిర్ణయాలు కూడా ధోని తీసుకున్నట్లుగా కంపెనీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ధోని ఐపీఎల్‌లో ఈ సంవత్సరం రైసింగ్ పూణె తరపున ఆడబోతున్నాడు.