ఇక నేడు ఏడు గంటలకు ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ధోనీ ప్రకటించాడు. దాంతో అంతా కూడా ధోనీ తన రిటైర్మెంట్ను ప్రకటించబోతున్నట్లుగా అనుకుంటున్నారు. కాని బీసీసీఐ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ధోనీ రిటైర్మెంట్ వార్తలు నిజం కాదని, ధోనీ ప్రెస్‌మీట్ రిటైర్మెంట్ గురించి అని తాము భావించడం లేదని, తమకు ఇప్పటి వరకు ఎలాంటి విషయాన్ని ధోనీ వెళ్లడించలేదని టీం ఇండియా సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. బీసీసీఐ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పడంతో ధోనీ రిటైర్మెంట్ వార్తలు నిజం కాదని తేలిపోయింది. అయితే ఏడు గంటలకు ధోనీ ఏం చెప్పబోతున్నాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.