మరో బిజినెస్‌లోకి మహేంద్రుడు

ఇండియన్‌ క్రికెట్‌లో సచిన్‌ తర్వాత అంతటి గుర్తింపును దక్కించుకున్న గొప్ప క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని. ఈయన ఆట ఆటడంతో పాటు బయట వ్యాపార సామ్రాజ్యంలో కూడా తనదైన దూకుడును కొనసాగిస్తున్నాడు. ఒక వైపు పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉంటూనే మరో వైపు పలు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ ఎన్నో కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికే పలు కంపెనీల్లో వాటాదారుగా ఉన్న ధోని తాజాగా కార్స్‌ 24 సంస్థలో భాగస్వామ్యం తీసుకున్నాడు. కార్ల కొనుగోలు మరియు అమ్మకాలు కార్స్‌ 24లో జరుగుతాయి.

సెకండ్‌ హ్యాండ్‌ కార్ల షో రూంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కార్స్‌ 24కు విపరీతమైన ఆధరణ ఉంది. ఇలాంటి సమయంలో ధోనీ కార్స్‌ 24కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తు కొంత మొత్తం షేర్‌ను దక్కించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయాలనా, తమ వద్ద ఉన్న పాత కార్లను అమ్మాలన్నా కూడా కార్స్‌ 24ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇది మంచి లాభదాయక బిజినెస్‌ అవ్వడం వల్ల ధోనీ ఈ బిజినెస్‌లో ఎంట్రీ అయినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడి పెట్టకుండానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ధోనికి కొంత మొత్తంను సంస్థ వారు షేర్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ధోనీ ఎంట్రీ అయిన తర్వాత తమ ప్రాంచైజీలను 300 పట్టణాలకు విస్తరించాలని భావిస్తున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.