ఈ మధ్య ఎక్కడ చూసిన బుల్లెట్ బండి సాంగ్ వినిపిస్తుంది. పెళ్లి బరత్ లో నూతన వధువు ఈ పాట కు అదిరిపోయే స్టెప్స్ వేసింది. అంతే ఈ సాంగ్ ఒక్కసారిగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ , పొలిటికల్ లీడర్స్ వరకు ఈ సాంగ్ కు స్టెప్స్ వేస్తున్నారు. అంతే కాదు ఏ వేడుకలో చూసిన ఈ సాంగ్ మారుమోగిపోతుంది. అంతలా ఈ సాంగ్ అందరికి నచ్చింది. కేవలం మనుషులకే కాదు మూగజీవులకు కూడా ఈ సాంగ్ నచ్చింది. ఈ సాంగ్ పెడితేనే పాలు తాగుతున్నాయి.
మహబూబాబాద్‌లోని కంబాలపల్లెలో ఓ కొండముచ్చు ఈ సాంగ్ పెడితేనే పాలు తాగుతుంది. కంబాలపల్లెలో కిరాణ దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి.. గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఓ ఆడ కొండముచ్చును తీసుకొచ్చాడు. దీనికి ఓ పిల్ల కొండముచ్చు ఉంది. అనారోగ్యంతో వారం క్రితం తల్లి చనిపోయింది. అప్పటినుంచి పిల్ల కొండముచ్చుకు పాలు తాపినా తాగడం లేదు. దీంతో ఈ యజమాని.. బుల్లెట్టు బండి పాటను సెల్‌ఫోన్‌లో వినిపించాడు. భాష, భావం అర్థం కాకపోయినా కొండముచ్చును ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంది. పాట వింటూ చకచకా పాలు తాగేస్తోంది. దీంతో గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు.