దేశ ప్రధాని మోడీ ప్రజలందరికి క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిని మొదట్లోనే అరికట్టాలనే ఉద్దేశ్యం తో మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో 63వ మన్ కీ బాత్ ఎడిషన్‌లో దేశ ప్రజలతో ఉదయం 11 గంటలకు రేడియోలో మాట్లాడిన ప్రధాని మోదీ… ఈసారి ప్రధానంగా కరోనా వైరస్‌పైనే చర్చించారు.
21 రోజుల పాటూ లాక్‌డౌన్ నిర్వహించాలని తాను ప్రకటించక తప్పలేదన్న ప్రధాని మోదీ… అందుకు తనను క్షమించాలని కోరారు. తనపై పేద ప్రజలకు చాలా కోపంగా ఉందన్న మోదీ… తనకు వేరే మార్గం లేకుండా పోయిందన్నారు. కరోనా వైరస్‌పై పోరాడాలంటే ఇలాంటి నిర్ణయం తప్పని సరి అన్నారు. ప్రపంచ దేశాల్ని గమనించినప్పుడైనా మనం ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని అర్థమవుతుందని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో అన్నారు.