లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు అన్ని జిల్లాలో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా..లేక పొడిగిస్తారా అనే చర్చ అందరూ చేస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షనేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 14న ‘లాక్‌డౌన్’ ఎత్తివేసే ఆలోచన లేదని.. ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయలేమని ఈ మీటింగ్ లో ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కరోనా కారణంగా పరిస్థితులు మునపటిలా లేవని.. లాక్‌డౌన్‌పై వస్తున్న పలు సూచనలు, సలహాలు పరిశీలిస్తున్నట్లు మోదీ అన్నారు.

లాక్‌డౌన్ పొడిగించాలని ఇప్పటికే కేంద్రానికి పలు రాష్ట్రాల విజ్ఞప్తులు చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్ పొడిగించడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మరోసారి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.