టీ20కి మిథాలీ గుడ్‌బై

లేడీ సచిన్‌గా గుర్తింపు తెచ్చుకుని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న మిథాలీ రాజ్‌ సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ ఆడుతున్న విషయం తెల్సిందే. చిన్న వయసులోనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్‌ దాదాపుగా రెండు దశాబ్దాలుగా తన బ్యాట్‌తో లేడీ టీం ఇండియా జట్టుకు విజయాలను అందించింది. వన్డేలు మరియు టీ20ల్లో అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేసింది. రాబోయే మహిళ వన్డే ప్రపంచ కప్‌ కోసం సన్నద్దం అయ్యే ఉద్దేశ్యంతో తాను టీ20లకు గుడ్‌ బై చెప్పినట్లుగా ప్రకటించింది.

ఇప్పటి వరకు 32 టీ20లు ఆడిన మిథాలీ రాజ్‌ మూడు టీ20 ప్రపంచ కప్‌ టోర్నీల్లో ఆడింది. 2006 నుండి టీ20ల్లో ఆడుతున్న మిథాలీ రాజ్‌ జట్టుకు పలు చిరస్మరనీయమైన విజయాలను అందించింది. నా దేశంకు ప్రపంచ కప్‌ అందించాలనేది నా కల. అందుకే ఆ టోర్నీకి సిద్దం అవ్వాలనే ఉద్దేశ్యంతో టీ20కి దూరం అవుతున్నట్లుగా ఆమె ప్రకటించింది. బీసీసీఐకి ఈ సందర్బంగా కృతజ్ఞథలు చెబుతున్నాను. నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అంటూ మిథాలీ పేర్కొంది. మిథాలీ టీ20 నుండి తప్పుకున్నా వన్డేల్లో ఆమె కొనసాగనుంది కనుక ఫ్యాన్స్‌ హ్యాపీగానే ఉన్నారు. ఆమె ప్రపంచ కప్‌ అందించాలని ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు. 2021 ప్రపంచ కప్‌ తర్వాత వన్డేలకు కూడా మిథాలీ రాజ్‌ గుడ్‌ బై చెప్పే అవకాశం ఉందంటున్నారు.