Site icon TeluguMirchi.com

శంషాబాద్ లో దారుణం : మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం

దేశంలో రోజు రోజుకు ఆడవారిపై , అభం శుభం తెలియని బాలికల ఫై అత్యాచారాలు పెరుగుతుండగా..తాజాగా శంషాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన బయటకొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గోపి..అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు. ఆ అత్యాచార దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి , ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. నా దగ్గర గన్ వుంది నీ తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ బెదిరించి అఘాయిత్యానికి అతను పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. విషయం బయట పడడంతో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అతని వద్ద గన్ ఉందా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Exit mobile version