సినిమాల్లో చోరీలు ఎలా జరుగుతాయో చూస్తాం..వాటిని చూసి వామ్మో ఏమన్నా చోరీ చేసారా అని మాట్లాడుకుంటాం. అదే రియల్ గా జరిగితే ఇంకేమన్నా ఉందా..? తాజాగా ఆంధ్ర-కర్ణాటక బోర్డర్లో సినిమా రేంజ్ లో చోరీ జరిగింది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని నెంగలి చెక్ పోస్ట్ దాటిన తర్వాత చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న మొబైల్స్ కంటైనర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వెంబడించారు. డ్రైవర్ సురేష్‌ను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి చితకబాది.ఆ మొబైల్స్ ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన మొబైల్స్ విలువ సుమారు రూ.6.5 కోట్లు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.