హైదరాబాద్ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా మూతపడిన మెట్రో సౌకర్యాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే కొన్ని స్టేషన్లకు మాత్రమే ఓపెన్ కాగా..ఇప్పుడు మరికొన్ని స్టేషన్ లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాదు మెట్రో టైమింగ్స్ లలో కూడా మార్పులు చేసారు.
తాజాగా భరత్‌నగర్, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రిలోనూ మెట్రో సేవలు ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు తప్పకుండా మాస్కులు ధరించి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరున్నరకే ప్రారంభిస్తున్నారు. ఆయా కారిడార్ల నుంచి రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే చివరి రైలు 10.30కు టెర్మినల్ స్టేషన్‌కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు.