హైదరాబాద్లో నగరంలో ఒకటైన మెహిదీపట్నంలో ఒక దారుణ ఘటన చోటుకేసుకుంది. వివరాల్లోకి వెళితే భార్యను అనుమానిస్తూ భర్త నడిరోడ్డుపై పంచాయితీ పెట్టాడు. సోమవారం రాత్రి నగరంలోని మెహదీపట్నం ఫ్లైఓవర్ సమీపంలో గల బస్టాండ్ వద్ద భార్యపై అనుమానం వ్యక్తం చేసిన భర్త.. బిడ్డ తనకు పుట్టలేదని నడిరోడ్డుపై భర్త పంచాయితీ పెట్టాడు. .
ఆగ్రహావేశానికి గురైన భార్య, భర్త చేతుల్లో ఉన్న బిడ్డను లాక్కుని నేలకేసికొట్టింది. దాంతో ఆ పసికందుకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త వెంటనే స్పందించి బిడ్డను అక్కున చేర్చుకుని, భార్యను లాగిపెట్టి కొట్టాడు. రోడ్డుపైనే దంపతులు వాదులాడుకోవడంతో వాహనదారులుకు అక్కడ ఏం జరుగుతుందో తెలీక ఆందోళనకు గురయ్యారు. దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని దంపతులిద్దరిని మందలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యా, భర్తలిద్దరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. పసిబిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.