Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ .. ఉంచాలా ? ఎత్తేయాలా ?


ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ను కొన‌సాగించాలా? ఎత్తేయాలా? అనే అంశంపై రాష్ట్రాల వారీగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందిస్తూ ఉన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వారంలో రోజుల్లో అంటే ఏప్రిల్‌14వ తేదీతో ఈ లాక్‌డౌన్‌ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తుతున్నాయట.

రాష్ట్రాలు చేస్తున్న విజ్ఞప్తులపై కేంద్రం సమాలోచనలు జరుపుతోంది. ఏప్రిల్‌ 14వ తేదీతో లాక్‌డౌన్‌ పూర్తి చేయాలా? కొనసాగించాలా? అన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ పూర్తవుతుందని గతంలో కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Exit mobile version